శ్రీకాకుళం: జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు నివాసానికి విచ్చేశారు. అనంతరం యువ నాయకుడు ఎన్. తేజ బాబు నిర్వహిస్తున్న NER ప్రీమియర్ లీగ్, మోదీ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను మంత్రి సందర్శించి క్వార్టర్ ఫైనల్స్‌ను ప్రారంభించారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని క్రీడాకారులకు సూచించారు.