బాపట్ల మండల కేంద్రంలోని సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న శివ ప్లాట్స్ సమీపంలోని ఓ పొలంలో సుమారు 50 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు మండలంలోని యేట్రవారిపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాస రెడ్డిగా ఆయన బంధువులు గుర్తించినట్లు కర్లపాలెం ఎస్సై రవీంద్ర తెలిపారు.