NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గం లబ్బిపేటలోని మస్జిద్-ఎ-లబాబియన్ మసీదులో వైసీపీ మైనారిటీ నేతలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించి, అనంతరం మసీదులో నిర్వహించిన నమాజ్‌లో పాల్గొన్నారు.