PPM: సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్.భాస్కరరావు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా సిబ్బంది పనిచేయాలన్నారు. ల్యాబ్,ఫార్మసీ, ఓపి రికార్డులు, వార్డులను పరిశీలించారు. రోగుల ఆరోగ్య వివరాలు స్పష్టంగా తెలుసుకొని సంతృప్తి చెందే విధంగా వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.