BPT: టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ నియామకంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకత్వానికి లభించిన గౌరవమే ఈ పదవి అని పేర్కొన్నారు. లోకేష్ నాయకత్వంలో పనిచేయడానికి యువత అధికంగా ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. యువగళం పాదయాత్ర ద్వారా విమర్శకులకు తగిన సమాధానం ఇచ్చారని చెప్పుకొచ్చారు.