KRNL: రాజమండ్రిలో మే 30, 31న జరగనున్న అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ పోటీలలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బుధవారం ఏపీ డ్రాగన్ బోట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవినాష్ ఆరోపించారు. అసోసియేషన్‌కు సమాచారం ఇవ్వకుండా పోటీలు నిర్వహించడం సరికాదన్నారు. అధికారిక గుర్తింపు ఉన్న ఫెడరేషన్లను సంప్రదించి పోటీలు నిర్వహించాలన్నారు.