PPM: పార్వతీపురంలో లారీ ఢీ కొని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పార్వతీపురం మండలం సంఘం వలస గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ గంట రామకృష్ణ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.