CTR: వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు ప్రారంభించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు పర్యవేక్షణలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేశారు.