W.G: విద్యుత్ ఛార్జీల పెంపు అంటూ వైసీపీ ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. శనివారం భీమడోలులోని క్యాంపు కార్యాలయంలో గన్ని మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ బిల్లులు అంశంపై మాజీ సీఎం జగన్ చేసే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.