TPT: నాయుడుపేట శ్రీనివాస కళ్యాణ మండపంలో టీడీపీ మహానాడు వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి మహానాడును అందరూ వీక్షించేలా అక్కడ భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పసుపు తోరణాలు, జెండాలతో నాయుడుపేట పట్టణం పండుగ వాతావరణాన్ని తలపించింది.