GNTR: జైనమత 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు జయంతి సందర్భంగా గుంటూరు నగరంలో జైనులు భక్తి శ్రద్దలతో ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ఆర్.అగ్రహారం మహావీర్ దేవాలయం నుంచి కొత్తపేట మీదుగా అరండల్పేట జైన్ దేవాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పొందారు. అహింస, జీవకారుణ్యం, శాకాహారం ప్రాముఖ్యతపై సందేశాలు ఇచ్చారు.