VZM: కాలేజీలలో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలను బొబ్బిలి CI కె.నారాయణరావు సూచించారు. మంగళవారం స్దానిక పోలీస్ స్టేషన్లో విద్యా సంస్దల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యా సంస్థల్లో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై విద్యార్ధినిలకు అవగాహన కల్పించాలన్నారు.