కడప: జిల్లా మహిళా చైర్ పర్సన్ అన్నపురెడ్డి రాణికి అరుదైన గౌరవం దక్కింది. ఆమె చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి, తెలంగాణ ఆదర్శ కళావేదిక ఫిలిం సంస్థ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆమెను సన్మానించింది. ఈ సందర్భంగా మరికొందరు గౌరవ అతిథుల చేతుల మీదుగా ఆమెకు నంది అవార్డును అందజేశారు.