BPT: అద్దంకి మండలంలోని అన్ని గ్రామాల్లో 3వ శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల థీమ్ “జలం జీవం”గా చక్రాయపాలెంలో విద్యార్థులతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. వర్షపు నీటి సంరక్షణ, చెరువుల కట్టల బలోపేతం వంటి చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, గ్రామ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.