PLD: ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో రూ.36 లక్షలతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.