AKP: రైతు భరోసా,పీఎం కిసాన్ పథకం కింద పెట్టుబడి సాయం అందడం లేదని పాయకరావుపేటకు చెందిన విసరపు దుర్గ భవాని శంకర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తనకు అదే మండలం అరట్లకోటలో 2.50 ఎకరాల భూమి ఉందన్నారు. ఆన్ లైన్లో తన పేరు చూపిస్తున్నా తన ఖాతాలో డబ్బులు పడలేదన్నారు. అధికారులకు సమస్య తెలియజేసిన స్పందించలేదన్నారు.