ATP: రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని పుల్లలరేవు గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. రూ.50 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. అలాగే గొందిరెడ్డిపల్లి నుంచి పుల్లలరేవు వరకు రూ.1.30 కోట్ల ఏపీఆర్ఆర్పీ నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయని ఆమె తెలిపారు.