ATP: కుందుర్పి మండలం కదిరంపల్లి గ్రామంలో గత నెల రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. గ్రామస్థులు త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం గ్రామానికి వచ్చిన వాటర్ ట్యాంకర్ వద్ద నీటి కోసం జనం ఎగబడ్డారు. బిందెలతో వరుసలో నిలబడే క్రమంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు తిట్టుకుంటూ గొడవకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.