అన్నమయ్య: మదనపల్లిలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ యం. వెంకటాద్రి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, విద్యాభివృద్ధికి వెంకటరెడ్డి చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.