SKLM: సోంపేటలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. పలాసపురం గ్రామానికి చెందిన బడ్డి పున్నాలు (75)ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పలాస డిపోకు చెందిన బస్సు బాతుపురం నుంచి సోంపేట వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.