కృష్ణా: నందివాడ మండలం వెంకటరాఘవాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రామాపురం సెంటర్ మెయిన్ రోడ్డులో పంచాయతీ వాటర్ పైప్ లీక్ కారణంగా రోడ్డుమీద నీరు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని గ్రామస్తులు బుధవారం వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి, పైప్ లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.