కోనసీమ: రావులపాలెం మండలం గోపాలపురం గ్రామ దేవత గోకులాంబ అమ్మవారి శతాబ్ది ఉత్సవాల్లో బుధవారం రాత్రి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోకులాంబ అమ్మవారి ఉత్సవాలు నాలుగు రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.