GDWL: గద్వాల పట్టణ శివారులో రూ.5.7 కోట్లతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ భవనం అందుబాటులోకి వస్తే మహిళలు వినియోగించుకుంటారన్నారు.