కడప: పులివెందుల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి శనివారం నిరసనకు దిగారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉంది. నన్ను అవమానించడానికే వైసీపీ కౌన్సిలర్లు, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సమయానికి రాలేదు. ఈరోజు సమావేశాన్ని వాయిదా వేసి మరోరోజు నిర్వహించాలి’ అని ఎమ్మెల్సీ కమిషనర్‌ను కోరారు.