NDL: కోవెలకుంట్ల మండలం రేవనూరు పరిధిలో పోలీసులు దాడులు నిర్వహించి 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మద్దిలేటి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ధనుంజయ్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.