PLD: పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు యూరియా కొరతపై రైతుల ఆందోళనలను తొలగించడానికి గ్రామ స్థాయిలో అవగాహన బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ బృందాల్లో వీఆర్వో, మహిళా పోలీసు, వ్యవసాయ, ఉద్యాన సహాయకులు సభ్యులుగా ఉంటారన్నారు. ప్రతి రైతు వద్దకు వెళ్లి యూరియా కొరత లేదని వివరించాలన్నారు.