PLD: పెదకూరపాడు మండలం బుచ్చయ్యపాలెం గ్రామంలో జల జీవన మిషన్ ద్వారా, రాఫిడ్ శాండ్ ఫిల్టర్ నందు పనిచేస్తున్న ఆపరేటర్లకు 5 నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆపరేటర్ శ్రీనివాసరావు తెలిపారు. నెలకు ఇచ్చే 8వేలు జీతం కూడా సకాలంలో ఇవ్వకపోతే కుటుంబ పోషణ ఇబ్బంది కరంగా ఉందని పలువురు ఆపరేటర్లు ఆవేదన చెందారు. RWS అధికారులు స్పందించి తమకు వేత్తనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.