ATP: గుత్తిలోని పురాతనమైన సీఎస్ఐ చర్చిలో శుక్రవారం యేసుక్రీస్తు సిలువ త్యాగాన్ని స్మరించుకుంటూ క్రైస్తవులు ‘గుడ్ ఫ్రైడే’ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, నిశ్శబ్ద ప్రదర్శనలు, ఉపవాస దీక్షలు, క్రీస్తు కడపటి ఏడు మాటలపై ధ్యానంతో ఈ పవిత్ర దినం కొనసాగిందని చర్చి పాస్టర్ తెలిపారు.