PLD: వినుకొండ-అద్దంకి రోడ్డులోని రైల్వేగేటు వద్ద నిర్మించే ROB స్థలాన్ని శుక్రవారం అధికారులు పరిశీలించారు. రూ.54 కోట్లతో రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీన్ని నిర్మిస్తాయి. గత ప్రభుత్వం ఈ పనులను పట్టించుకోలేదు. తాజాగా భూసేకరణ, విద్యుత్ లైన్ల మార్పిడి అడ్డంకులను అధికారులు తొలగించారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని వారు తెలిపారు.