నెల్లూరు: ముత్తుకూరు మండలం పిడత పోలూరు వద్ద ఏపీ జెన్కో రోడ్డుపై పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ఘటనలో బాధితుడిని ఆయన సొంత మేనళ్లుడే మోసం చేసినట్లు తెలిపాడు. నిందితులను చెన్నై ఎయిర్ పోర్ట్లో శనివారం అదుపులోకి తీసుకొని వారి నుంచి కొంత నగదును రికవరీ చేశామన్నారు.