PLD: వినుకొండ పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో ఎరువులు, పురుగుల మందుల వ్యాపారులతో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సోమవారం రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎరువుల సరఫరాపై సమీక్ష సమావేశం అనంతరం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేతుల మీదగా పొలం పిలుస్తుంది వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి పాల్గొన్నారు.