NLG: అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హౌసింగ్ పీడీ రాజకుమార్ స్పష్టం చేశారు. శనివారం నూకలవారిగూడెంలో సర్పంచ్ బద్దం రజితతో కలిసి ఓ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే మంజూరై నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.