కేపీ చౌదరి డ్రగ్స్ కేసు(KP Chaudary Drugs Case)లో పేర్లు బయటకు వచ్చిన సెలబ్రిటీలు ఒక్కక్కరే స్పందిస్తూ వస్తున్నారు. ముందు అషురెడ్డి, ఆ తర్వాత నటి జ్యోతి(Jyothi) రియాక్ట్ కాగా తాజాగా ఇప్పుడు సురేఖా వాణి(Surekha vani) కూడా తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వీడియో రిలీజ్ చేశారు. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జూన్ 13వ తేదీన నిర్మాత కేపీ చౌదరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
డ్రగ్స్ కేసుతో సంబంధం లేదని వీడియో రిలీజ్ చేసిన సురేఖా వాణి:
తాను సినీ పరిశ్రమలోని కొంత మంది సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు కేపీ చౌదరి పోలీసుల విచారణలో అంగీకరించారు. కొంత మంది నటీమణులతో అయితే వందల సార్లు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అషు రెడ్డి, నటి జ్యోతి, ప్రముఖ ఆర్టిస్ట్ సురేఖా వాణి(Surekha vani) నంబర్లు కూడా కేపీ చౌదరి ఫోనులో ఉన్నాయని, ముఖ్యంగా కేపీ చౌదరి పార్టీలకు సురేఖా తన కూతురితో సహా వెళ్లినట్లు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. వాటిపై సురేఖా వివరణ ఇస్తూ వీడియో రిలీజ్ చేశారు.
గతకొంత కాలంగా తమపై వస్తున్న ఆరోపణలకు, తమకు ఎటువంటి సంబంధం లేదని, దయచేసి అలా ఆరోపణలు చేయడం ఆపాలని, అటువంటి ఆరోపణల వల్ల తమ కెరీర్, ఫ్యూచర్, పిల్లల కెరీర్, ఆరోగ్యం అన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతామని అన్నారు. తమని అర్థం చేసుకుని ఆరోపణలు ఆపాలని సురేఖా(Surekha vani) వీడియో రిలీజ్ చేశారు.
డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని చెబుతోన్న నటి జ్యోతి వీడియో:
మరో వైపు నటి జ్యోతి(Actress jyothi) కూడా తమపై వస్తున్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో, న్యూస్ ఛానళ్లలో తన ఫోటోలు ఎందుకు పబ్లిష్ చేస్తున్నారని ప్రశ్నించారు. అమ్మాయిలు ఈజీ టార్గెట్ అయ్యారా, అబ్బాయిల ఫోటోలు ఎందుకు వేయడం లేదని జ్యోతి ఫైర్ అయ్యారు. కేపీ చౌదరి తనకు ఫ్రెండ్ మాత్రమేనని, డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదన్నారు. డ్రగ్స్ పార్టీలకు ఎప్పుడూ వెళ్లలేదని, అవసరం అయితే నార్కోటిక్ టెస్ట్ చేయించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.