ఎన్నో నిరసనలు, ఆందోళనల నడుమ విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు వసూలు చేస్తోంది. మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. సుదీప్తోసేన్ (Sudiptosen) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విపుల్ అమృత్ లాల్ షా (Amrit Lal Shah) నిర్మాతగా వ్యవహరించారు. విడుదలకు ముందు నుంచే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా ఈ చిత్రం వసూళ్ల విషయంలో కొత్త రికార్డును సాధించింది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా నిలిచింది.
వివాదాస్పదంగా నిలిచిన ది కేరళ స్టోరీ సినిమాపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) స్పందించారు. తనకు పబ్లిసిటీ సినిమాలు నచ్చవని నిర్మొహమాటంగా చెప్పారు. అలాంటి సినిమాలకు తాను వ్యతిరేకినని స్పష్టం చేశారు. ఎప్పటికీ తన వైఖరి అదేనని పేర్కొన్నారు. టైటిల్ కింద నిజమైన కథ అని రాయగానే సరిపోదని, అలా రాసినంత మాత్రాన అది నిజమైన కథ అవుతుందా? అని వ్యాఖ్యానించారు. మే మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది కేరళ స్టోరీ చిత్రం సంచలన విజయం అందుకుంది. లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. సుదీప్తో సేన్ (Sudeepto Sen) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆదా శర్మ(Adah Sharma), యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధానపాత్రల్లో నటించారు.