మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi)కి ఎంత మంది మనరాళ్లు ఉన్నారు అనే ప్రశ్న ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ విషయం తెలుసుకోవాలని నెటీజన్లు నెట్టింట తెగ వెతికేస్తున్నారు. రామ్చరణ్(Ram Charan)-ఉపాసన దంపతులుకి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. చిరుకి ఇద్దరు కూతుళ్లు సుష్మిత(Sushmita), శ్రీజ కొడుకు రామ్చరణ్ అన్న సంగతి తెలిసిందే. చిరంజీవికి ఇప్పటికే నలుగురు మనవరాళ్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ఐదుకు చేరింది.
పెద్ద కూతురు సుష్మితకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఇందులో ఒకమ్మాయి పేరు సమర కాగా మరొకరి పేరు సంహిత. ఇక రెండో అమ్మాయి శ్రీజ (Srija) కు సైతం ఇద్దరు ఆడపిల్లలు. వారి పేర్లు నివృత్తి, నవిష్క.ఇక కుమారుడు రామ్చరణ్కు సైతం నేడు(జూన్ 20)ఆడబిడ్డే కలగడంతో చిరంజీవికి మొత్తం ఐదుగురు మనవరాళ్లు అయ్యారు.వివాహామైన దాదాపు 11 సంవత్సరాల తరువాత రామ్చరణ్-ఉపాసనలు తల్లిదండ్రులు కావడంతో చిరంజీవి మరోసారి తాత అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
నా కుటుంబం, నేను ఆంజనేయ స్వామి(Anjaneya Swami)నే నమ్ముకున్నాం. ఆయనకు సంబంధించి పరమ పవిత్రమైన మంగళవారం రోజున ఆడ బిడ్డను ప్రసాదించటం అనేది అపురూపంగా భావిస్తున్నాం. అపోలో ఆసుపత్రి(Apollo Hospital)లో బెస్ట్ టీమ్ పర్యవేక్షణలో చాలా సుఖంగా ప్రసవం జరిగింది. అందరికీ ధన్యవాదాలు’’ అని చిరు అన్నారు. కాగా, రామ్ చరణ్-ఉపాసన దంపతులు పుత్రికను చూసేందుకు మెగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలివచ్చారు. చిరంజీవి-సురేఖ, వరుణ్ తేజ్, కొణిదెల నిహారిక, అల్లు అర్జున్(Allu Arjun)-స్నేహారెడ్డి, అల్లు అరవింద్ తదితరులు ఆసుపత్రికి వచ్చారు.