టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో రష్మిక ఒకరు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఆ వార్త ప్రకారం, రష్మికను ఆమె మేనేజర్ మోసం చేశాడు. దాదాపు రూ.80లక్షల డబ్బు కాజేసాడు అని వార్తలు వస్తున్నాయి. దీంతో, ఆమె అతనిని ఉద్యోగం లో నుంచి తొలగించింది అని వార్తలు రాస్తున్నారు. అయితే, తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే అది నిజం కాదట.
ఆయన ఎలాంటి డబ్బులు కాజేయలేదని రష్మిక సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆ మేనేజర్ రష్మిక తో దాదాపు చలో సినిమా నుంచే కలిసి పనిచేస్తున్నారు. అయితే, ప్రస్తుతం రష్మిక నార్త్ సినిమాలో చాలా బిజీగా ఉంటుంది. దీంతో, ఆమె ముంబయిలోని క్వాన్ టాలెంట్ ఏజెన్సీతో డీల్ కుదుర్చుకుంది. ఆ సంస్థే రష్మిక అన్ని వ్యవహారాలు ఆ సంస్థ చేసుకుంటోందట. అందుకే పాత మేనేజర్ కి వీడ్కోలు చెప్పాలని నిర్ణయం తీసుకుందట.దీంతో, ఇద్దరూ పర్సనల్ విషయాల నేపథ్యంలోనే విడిపోయారట. వీరిద్దరూ స్నేహిపూర్వకంగా విడిపోయారు. అంతేకానీ, వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బయట వస్తున్న వార్తలు మాత్రం నిజం కాదు అని తేలడం గమనార్హం.