కర్ణాటక(Karnataka)లోని సిద్దరామయ్య ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సు(RTC bus)ల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఏ ఊరిలో చూసినా ఆర్టీసీ బస్సుల్లో మహిళల(women)తో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సీట్ల కోసం మహిళలు గొడవలకు ఎగబడుతున్నారు. ఓ బస్సులో చుట్టు ప్రయాణికులు (Passengers) ఉన్నారన్న కనీస జ్ఞానం లేకుండా చీరలు లాగి, జట్లు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్నారు.
దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.‘శక్తి యోజన’ పథకం(Shakti Yojana’ scheme)లో భాగంగా మహిళలకు ఫ్రీ ప్రయాణ (Free travel) సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళ ప్రయాణికుల తాకిడి రోజు రోజుకీ పెరిగిపోతూ ఉంది. బస్సులో రద్దీ ఎక్కువ పెరిగిపోవడంతొ మహిళల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరిగినపుడు చుట్టు ఉన్నవారు కనీసం ఆపకుండా కళ్లు అప్పగించి చూస్తున్నారు.