Bunny : పుష్ప2తో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప పార్ట్ వన్ ఊహించని విధంగా బన్నీకి పాన్ ఇండియా స్టార్డమ్ తెచ్చిపెట్టింది. అందుకే సెకండ్ పార్ట్‌ను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ముందుగా అనుకున్న కథలో పాన్ ఇండియా మార్పులు చాలా చేశాడు సుకుమార్.
పుష్ప2తో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప పార్ట్ వన్ ఊహించని విధంగా బన్నీకి పాన్ ఇండియా స్టార్డమ్ తెచ్చిపెట్టింది. అందుకే సెకండ్ పార్ట్‌ను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ముందుగా అనుకున్న కథలో పాన్ ఇండియా మార్పులు చాలా చేశాడు సుకుమార్. పుష్ప మూవీకి పెట్టిన బడ్జెట్‌కు డబుల్ బడ్జెట్ పెడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ కూడా సుకుమార్‌కు అన్లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చినట్టు టాక్. ఇటీవలె పుష్ప2 షూటింగ్ మొదలైంది. వైజాగ్‌లో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం రామోజి ఫిలిం సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే డిసెంబర్లో లేదా.. నెక్స్ట్ సంక్రాంతికి పుష్ప2 రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పట్లో పుష్పరాజ్ నుంచి అప్టేట్స్ రావడం కష్టమే అనుకున్నారు. కానీ బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడట సుకుమార్. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా.. ‘పుష్ప 2’ అప్డేట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టీజర్ లేదా ఏదైనా గ్లింప్స్ వీడియో విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇదే నిజమైతే.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పొచ్చు. అంతేకాదు ఏప్రిల్ నుంచే పుష్పరాజ్ హంగామా రచ్చ మొదలవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా అల్లు అర్జున్ తన ట్విట్టర్లో ప్రొఫైల్ పిక్చర్ మార్చారు. బ్లాక్ షర్ట్‌లో కర్లీ హెయిర్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఈ లుక్.. సినిమాకు సంబంధించిదా, లేదంటే యాడ్ ఫోటోనా.. అనేది తెలియదు గానీ, ఈ ఫొటో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఏదేమైనా లుక్ మార్చడంలో స్టైలిష్ స్టార్ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు!