ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. స్థార్ హీరోల వింటేజ్ సినిమాలు వరుసగా రీ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమా కూడా రీ రిలీజ్ అయ్యింది. తాజాగా ‘బద్రి’ సినిమాను కూడా రీ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదిన ‘బద్రి’ని రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తేదీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
ఫిబ్రవరి 4వ తేదిన ‘బద్రి’ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. వాయిదా పడిన తేదీని తెలుపుతూ నిర్వాహకులు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. దర్శకుడిగా పూరీకి ఇది మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మ్యానరిజం, ఆటిట్యూడ్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు మెడ మీద చెయ్యి పెట్టుకునే మ్యానరిజం ఒక సిగ్నేచర్ లా మారిపోయింది. ఈ సినిమాకు రమణ గోగుల సంగీతాన్ని అందించారు.