VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శనివారం గజపతినగరం CI జీ.ఎ.వీ రమణ మహిళా సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని ఐదు PSలలో పనిచేస్తున్న మహిళా సిబ్బంది అందరికి వారు చేస్తున్న సేవలను గుర్తించి శాలువాలతో సత్కరించి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు కిరణ్ కుమార్ నాయుడు, మహేష్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.