మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇంట సందడి నెలకొంది. రామ్ చరణ్(Ramcharan) భార్య ఉపాసన కొణిదెల(Upasana Konidela)కు బుధవారం రాత్రి మెగాస్టార్ ఇంట్లో బేబీ షవర్(Baby Shower) కార్యక్రమం జరిగింది. ఈ ఫంక్షన్కు అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. సన్నిహితుల సమక్షంలో ఈ బేబీ షవర్ ను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్(Photos Viral) అవుతున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా(Game Changer Movie) షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ వచ్చేవారం చివరిలో పూర్తయ్యే అవకాశం ఉంది. షూటింగ్ పూర్తయ్యాక ఉపాసన(Upasana)కే సమయం కేటాయించాలని రామ్ చరణ్ భావిస్తున్నారు. కనీసం మూడు నెలల పాటు ఎటువంటి షూటింగులు లేకుండా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.
రామ్ చరణ్(Ramcharan), ఉపాసన(Upasana) దంపతులు తల్లిదండ్రులు కాబోతుండటంతో మెగా ఫ్యామిలీ(Mega Family) ఇంట సందడి నెలకొంది. అటు రామ్ చరణ్ కుటుంబం, ఇటు ఉపాసన కుటుంబం పుట్టబోయే బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఉపాసన ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జులైలో తనకు డెలివరీ డేట్ ఇచ్చినట్లు ఉపాసన ఇది వరకే తెలిపింది. కాగా గతంలో ఉపాసన తరపు స్నేహితులు ప్రత్యేకంగా దుబాయ్ లో బేబీ షవర్(Baby Shower) నిర్వహించారు. బుధవారం చిరంజీవి ఇంట ఈ బేబీ షవర్ కార్యక్రమం జరిగింది. సినీ సెలబ్రిటీలు(Cine Celebrities) కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి సందడి చేశారు.