»Ram Charan Shocking Decision Three Months Gap For Movies
Ram Charan: రామ్ చరణ్ షాకింగ్ డెసిషన్!?
ట్రిపుల్ ఆర్ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి 'గేమ్ ఛేంజర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan). ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. అయితే మధ్యలో ఇండియన్2 ఎంట్రీ ఇవ్వడంతో.. కాస్త డిలే అవుతూ వస్తోంది. రీసెంట్‌గానే ఈ నెలలో జరగాల్సిన ఇండియన్2 షెడ్యూల్ కంప్లీట్ చేశాడు శంకర్. దాంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ షూటింగ్‌తో బిజీ కాబోతున్నాడు. అయితే ఆ తర్వాత సినిమాలకు చిన్న బ్రేక్ ఇవ్వబోతున్నాడట చరణ్.
గేమ్ చేంజర్ సినిమా తర్వాత తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు చరణ్(Ram Charan). ఆ తర్వాత ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్‌తో పాటు.. ఇంకొన్ని భారీ ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. కానీ ఈ లోపు చరణ్ సినిమాలకు కాస్త బ్రేక్(brake) ఇవ్వనున్నాడనే న్యూస్.. ఇప్పుడు వైరల్‌గా మారింది. గేమ్ ఛేంజర్ షూటింగ్ అయిపోగానే.. దాదాపు మూడు నెలల(three months) పాటు బ్రేక్ తీసుకోబోతున్నాడట చరణ్. దీనికి ఓ బలమైన రీజన్ వినిపిస్తోంది.
రామ్ చరణ్ త్వరలోనే తండ్రి(father) కాబోతున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. మే చివర్లో ఉపాసన(upasana) డెలివరీ ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని నెలలు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నాడట చరణ్. కొద్ది రోజులు తల్లీ, బిడ్డలతో గడపాలనుకుంటున్నాడట. అందుకే ఈ బ్రేక్ అంటున్నారు. ఇక ఆ తర్వాత తిరిగి సినిమాల షూటింగులను పరుగులు పెట్టించనున్నాడట చరణ్. ప్రస్తుతం చరణ్, ఉపాసాన.. అమ్మ, నాన్నలుగా మారేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు.
ఇది కూడా చూడండి: Puri Jagannadh: ఇది కాంబో అంటే.. యంగ్ హీరోతో పూరి ప్లానింగ్?
చరణ్, ఉపాసనకు పెళ్లై పదేళ్లు(10 years) అవుతోంది. ఇటీవలే దుబాయ్ వెకేషన్‌కి వెళ్లి వచ్చింది ఈ జంట. అక్కడే సీమంతం కార్యక్రమం చేశారు. ఇక నెక్స్ట్ మెగా వారసుడు రాక కోసం ఎదురు చూస్తోంది మెగా ఫ్యామిలీ(mega family). ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే చరణ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వడం అనేది ఫ్యాన్స్‌కు కాస్త షాకింగ్‌గానే ఉంది. మరి రామ్ చరణ్ నిజంగానే సినిమాలకు కాస్త్ బ్రేక్ ఇస్తాడా? లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.