»Hc Restrains Youtube Channels For Sharing Videos On Aaradhya Bachchan Health
Aaradhya Bachchan: నన్ను ట్రోల్ చేస్తున్నారు… హైకోర్టుకు ఐశ్వర్య కుమార్తె
అందాల తార ఐశ్వర్య ముద్దుల కుమార్తె ఆరాధ్య బచ్చన్(Aaradhya Bachchan)ని ట్రోలర్స్ వెంటాడుతున్నారు. ఆమెను సోషల్ మీడియా(social media)లో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆరాధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండదు. బయట కనినిపించే సందర్భాలు కూడా తక్కువే. అయినా.. ఆమె ఆరోగ్యం సరిగా లేదు అంటూ... ఆరాధ్యను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.
బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యారాయ్ బచ్చన్ ముద్దుల కుమార్తె.. ఆరాధ్య బచ్చన్(Aaradhya Bachchan) ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) మెట్లేక్కనుంది. తన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్(YouTube channels)పై ఆరాధ్య బచ్చన్ ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ గురువారం హైకోర్టులో జరగనుంది.
11 ఏళ్ల మైనర్ అయిన తన గురించి, తన ఆరోగ్యం గురించి నిరాధారమైన రూమర్లను యూట్యూబ్ ఛానెల్స్(YouTube channels) ప్రసారం చేశాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఆరాధ్య తన ఫిర్యాదులో పేర్కొంది. నిజానికి ఆరాధ్య బచ్చన్‌పై కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు పనిగట్టుకుని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తుంటాయి.
ఇక సోషల్ మీడియాలో అయితే ఆరాధ్యను టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ ట్రోలర్స్ కి చెక్ పెట్టేలా ఆమె హైకోర్టు(Delhi High Court)ను ఆశ్రయించడం గమనార్హం. ఒకానొక దశలో ఈ ట్రోలింగ్స్, వార్తలపై విసుగుపోయిన అభిషేక్ బచ్చన్.. తనను, తన కూతురిని టార్గెట్ చేయడం మానుకోవాలని బాలీవుడ్ మీడియాను కోరారు.