ఈమధ్య కాలంలో దక్షిణాది నుంచి వైవిధ్యభరిత కథాంశాలతో సినిమాలు(Movies) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కొత్త కాన్సెప్ట్ మూవీస్(New Concept Movies)ను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. మంచి కంటెంట్(Content) ఉంటే చాలు ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ సినిమాలు కూడా మంచి వసూళ్లను రాబట్టుతున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ‘అనంత’ అనే సినిమా(Anantha Movie) ప్రేక్షకుల ముందకు రానుంది. ఎటువంటి అప్డేట్ లేకుండా ఒక్కసారిగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్(Trailer Release) చేశారు.
‘అనంత’ మూవీ ట్రైలర్:
‘అనంత’ సినిమా(Anantha Movie)ను ప్రశాంత్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మధుబాబు దర్శకత్వం(Director Madhubabu) వహిస్తున్నారు. జూన్ 9వ తేదిన ‘అనంత’ సినిమా విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూనే మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్(trailer Release) చేశారు. మూవీ కథాంశం ట్రైలర్లో చెప్పడానికి మేకర్స్ ట్రై చేశారు. అయితే సరికొత్త పాయింట్‌తో ఈ మూవీ రూపొందుతోందని ట్రైలర్‌ను చూస్తేనే అర్థమవుతోంది.
ఈ మూవీ ట్రైలర్(Anantha Movie Trailer)ను ఒక చర్చ నడుస్తున్నట్లు మేకర్స్ చూపించారు. మనిషి ఎక్కువ కాలం బతకడానికి ఏం చేయాలనే దానిపై ఈ మూవీ కథ సాగుతుంది. ప్రశాంత్ కార్తీ, అవినాశ్ కురువిల్ల, రితిక, విశ్వనాథ్ వంటివారు ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. అనంత మూవీకి ఘంటసాల విశ్వనాథ్ మ్యూజిక్(Ghantasala Viswanath) అందించారు.