ప్రీ రిలీజ్ ఈవెంట్కు లక్షలాదిమంది అభిమానులు తరలివచ్చారు. టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అందిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్న జీయర్ స్వామి విచ్చేశారు. పూర్ణకుంభంతో ప్రభాస్ దగ్గరుండి ఆయన్ని ఆహ్వానించారు.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక అంగరంగ వైభవంగా సాగింది. యుగయుగాలకు గుర్తుండిపోయేలా ఈవెంట్ ను నిర్వహించారు. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ప్రదాన పాత్రధారులుగా నటించిన ఈ మూవీ జూన్ 16వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ముందు ప్రమోషన్స్ కార్యక్రమాలను అద్భుతంగా చేపడుతున్నారు. తిరుపతిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక అద్భుతంగా చేపట్టారు.
హనుమాన్ పాత్రధారి దేవదత్త నాగ మాట్లాడుతూ..”శతాబ్దాల క్రితం ప్రభు శ్రీరాముడి రాజ్యం ఉండేది. చాలా ఏళ్ల తరువాత చరిత్ర పునరావృతం అవుతోంది. సరిగ్గా ఇదే మళ్ళీ రామరాజ్యం. ఒక్కడే సూర్యుడు. ఒక చంద్రుడు. ఒక డార్లింగ్. అతనే ప్రభాస్. మనం దుఃఖాన్ని చూసినప్పుడల్లా, సూర్యుని కిరణం, ఆశ యొక్క కిరణం కోసం ఆశిస్తాము, మన సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. అతనే రాముడి అవతారంలో ఉన్న ప్రభాస్. తిరుపతి కుటుంబంతో కలిసి ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. జై శ్రీ రామ్ అని జపిస్తూ ప్రపంచానికి గొప్ప సినిమాను అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఆయనే ఓం రౌత్. ఇక్కడ మన కృతి, మన భూదేవి కూతురు ప్రకృతి. స్నేహితులు మరియు కుటుంబం, ఇక్కడ ఉన్నందుకు ధన్యవాదాలు. ప్రభాస్ అభిమానుల ప్రేమ అద్బుతం. మళ్లీ జూన్ 16న రామోత్సవ్ను జరుపుకుంటాం” అన్నారు.
సంగీత దర్శకులు అజయ్-అతుల్ మాట్లాడుతూ..”ఈరోజు మాతో పాటు చాలా మంది ప్రేక్షకులను చూడటం చాలా ఆనందంగా ఉంది. గత రెండేళ్లుగా పాటల కోసం ఎదురుచూస్తున్నాం. టీమ్ అంతా కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమాకు పనిచేశారు. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు. పాటలను ఇంతగా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అన్ని పాటలు నేడు విడుదల కానున్నాయి. మీరు ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాము. మేము తెలుగులో మొదటిసారి ప్రదర్శించాము. మేము హిందీ మరియు మరాఠీతో పాటు ఏ భాషలోనైనా పాడాము అంటే ఇదే మొదటిసారి. కాబట్టి ఏవైనా తప్పులుంటే క్షమించండి” అని అన్నారు.