»Actress Anupama Parameswaran Hurt By Vulgar Comments
Anupama Parameswaran: పాపం అనుపమ.. బాగా హర్ట్ అయినట్లుంది..!
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ రేపు అంటే మార్చి 29న విడుదల కానుంది. ఈ సినిమా సంచలన విజయం సాధించిన డీజే టిల్లుకి సీక్వెల్. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి అనుపమ హాజరు కాలేదు. కారణమేంటో తెలుసుకుందాం.
Anupama Parameswaran: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ రేపు అంటే మార్చి 29న విడుదల కానుంది. ఈ సినిమా సంచలన విజయం సాధించిన డీజే టిల్లుకి సీక్వెల్. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లు , పోస్టర్లు, ట్రైలర్ ఇప్పటికే మూవీపై ఆసక్తిని పెంచేశాయి. నిజానికి మూవీపై అంత బజ్ రావడానికి మొదటి పార్ట్ ఎంత కారణమో.. ఈ మూవీలో హీరోయిన్ గా అనుపమను సెలక్ట్ చేయడం కూడా అంతే కారణం. ఇప్పటి వరకు చాలా పద్దతిగా నటించిన అనుపమ.. వెంటనే రూట్ మార్చి గ్లామర్ రోల్ లో నటించింది. గ్లామర్ గా కనిపించడమే కాదు.. ఏకంగా లిప్ లాక్ సీన్స్ లోనూ అదరగొట్టింది.
ట్రైలర్, పోస్టర్ మొత్తం ఇలాంటి సీన్లే కనపడుతున్నాయి. చాలా మంది షాక్ అయ్యారు కానీ సినిమాల్లో నటించడం తన డ్యూటీ అంటూ అనుపమ సంయమనం పాటించింది. అయితే చివరకు అనుపమ పరమేశ్వరన్ కొన్ని అసభ్యకరమైన కామెంట్స్ ఎక్కువగా రావడంతో బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. లీడ్ పెయిర్ ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటున్న పోస్టర్‌ను టీమ్ విడుదల చేసింది.ఇందులో అనుపమ సిద్ధు జొన్నలగడ్డకు చాలా దగ్గరగా ఉన్నట్లు చూపిస్తుంది. సిద్ధు జొన్నలగడ్డకు అనుపమ సన్నిహితంగా ఉండటంపై పలువురు నెటిజన్లు అసభ్యకరమైన కామెంట్లు పెట్టారు.
ఇది అనుపమ పరమేశ్వరన్‌ని తీవ్రంగా బాధించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఈరోజు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా హాజరు కాలేదు. పోస్టర్‌పై, ఆమె గైర్హాజరుపై ప్రముఖ నటుడు సిద్ధు జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చారు. దీంతో అనుపమ మనస్తాపానికి గురైందని, ఈ కార్యక్రమానికి దూరంగా ఉండమని చెప్పానని తెలిపారు. అలాగే హీరోయిన్లకు సంబంధించి పోస్ట్‌లు, కామెంట్లు చేసే సమయంలో కఠినంగా వ్యవహరించవద్దని నెటిజన్లు, అభిమానులను అభ్యర్థించాడు. ప్రతి ఒక్కరూ పరిమితుల్లో ఉండి సినిమాను ఆస్వాదించాలని, వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి నటీమణులను ఇబ్బంది పెట్టవద్దని సిద్ధూ అభ్యర్థించాడు. ఈరోజు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.