»Punjab Cm Bhagwant Mann Wife Dr Gurpreet Kaur Gave Birth To Daughter
Punjab : మరోసారి తండ్రయిన పంజాబ్ ముఖ్యమంత్రి
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటిలో ఆనందం వెల్లివిరిసింది. అతని భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. నిన్న రాత్రి సీఎం మాన్ భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు.
Punjab : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటిలో ఆనందం వెల్లివిరిసింది. అతని భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. నిన్న రాత్రి సీఎం మాన్ భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం భగవంత్ మాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “దేవుడు మాకు కూతురుని వరంగా ఇచ్చాడు. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు” అని రాశారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ 50 ఏళ్ల వయసులో మూడోసారి తండ్రి అయ్యారు. అతనికి మొదటి భార్య నుండి ఇప్పటికే తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం భగవంత్ మాన్ ప్రసంగిస్తూ.. నా భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ ఏడు నెలల గర్భవతి అని ప్రకటించారు. మార్చిలో మన ఇంటికి సంతోషం వస్తుంది. కొడుకు వస్తాడా, కూతురు వస్తాడా అని మేం ఎప్పుడూ ప్రయత్నించలేదు. కొడుకు, కూతురు ఎవరు వచ్చినా ఆరోగ్యంగా రావాలన్నదే నా కోరిక అన్నారు. జూలై 7, 2022న సీఎం భగవంత్ మాన్ తన కంటే 16 ఏళ్లు చిన్నదైన 32 ఏళ్ల డాక్టర్ గుర్ప్రీత్ కౌర్‌ను పెళ్లి చేసుకున్నారు. భగవంత్ మాన్‌కి ఇది రెండో పెళ్లి. డాక్టర్ గురుప్రీత్ కౌర్ హర్యానాలోని పెహోవా నివాసి.. తను MBBS వైద్యురాలు. సీఎం భగవంత్ మొదటి వివాహం ఇంద్రప్రీత్ కౌర్‌తో జరిగింది. అయితే 2015లో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకుల తర్వాత ఇందర్‌ప్రీత్ పిల్లలిద్దరితో కలిసి అమెరికా వెళ్లింది.