»Supriya Sharinate Congress Party Shocked By Supriyas Controversial Comments
Supriya Sharinate: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుప్రియాకు కాంగ్రెస్ పార్టీ షాక్
సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలో పార్టీ తాజాగా విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఆమె పేరును ప్రకటించలేదు.
Supriya Sharinate: సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలో పార్టీ తాజాగా విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఆమె పేరును ప్రకటించలేదు. ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ నుంచి సుప్రియా శ్రీనేత్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ స్థానం నుంచి పార్టీ తరఫున ఈసారి వీరేంద్ర చౌదరి పోటీ చేయనున్నారు. ఎన్నికల సమయంలో వివాదానికి తెర తీయడం వల్ల ఆమెను పక్కన పెట్టినట్లు సమాచారం. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కంగనా రనౌత్‌పై ఓ అభ్యంతకర పోస్ట్ పెట్టారు. దీనిపై కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెక్స్ వర్కర్ల జీవితాలను ప్రస్తావిస్తూ.. ఇతరులను దూషించడం మానుకోవాలని మండిపడ్డారు. అయితే ఆ పోస్టు చేసింది తాను కాదని.. తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల యాక్సెస్ చాలామంది దగ్గర ఉందని సుప్రియ తెలిపారు. అలాగే సుప్రియకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చేసిన వ్యాఖ్యలు సందర్భానికి తగ్గట్టు కానీ, హుందాగా కానీ లేవని తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని తెలిపింది. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు గౌరవప్రదంగా వ్యవహరించాలని తెలిపింది.