»Zuckerberg Is The Ceo Of Meta Company Which Is Offering Google Company Ai Employees
Zuckerberg: గూగుల్ కంపెనీ ఉద్యోగులకు జుకర్ బర్గ్ గాలం
సాంకేతిక రంగంలో ఏఐ ఎంత సంచలనం సృష్టిస్తోందో చూస్తూనే ఉన్నాము. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని మెటా సీఈఓ జుకర్ బర్గ్ ముందుగానే జాగ్రత్త పడుతున్నాడు.
Zuckerberg is the CEO of Meta Company, which is offering Google company AI employees
Zuckerberg: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial intelligence – AI) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టెక్ రంగంలో సంచనాలు సృష్టిస్తున్న ఈ సాంకేతికత రాబోవు రోజుల్లో ఇంకెలా ఉండబోతుందో ఊహించడానికి శక్తి సరిపోవడం లేదు. టెక్ రంగాన్ని అతి త్వరలోనే ఏఐ శాసించనుంది. అందుకే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ తెలిసిన ఉద్యోగులకు చాలా డిమాండ్ ఉంది. దీంతో అన్ని కంపెనీలు అప్రమత్తమయ్యాయి. వారి కంపెనీలో ఏఐ ప్రొడక్ట్స్ ఉండేలా చూసుకుంటున్నాయి. ఈ సందర్భంగా మెటా కంపెనీ సీఈఓ జుకర్ బర్గ్ గూగుల్ కంపెనీపై కన్నెశారు. ఆ సంస్థలో పనిచేస్తున్న ఏఐ నిపుణులకు గాలం వేస్తున్నారు. ఫేస్బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తగిన మార్పులు తీసుకురావడానికి మార్క్ జుకర్‌బర్గ్ పలువురికి వ్యక్తిగతంగా ఈమెయిల్స్ పంపుతున్నట్లు సమాచారం.
గూగుల్‌లో ఏఐ విభాగం డీప్‌మైండ్‌లో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్‌ను సంప్రదించినట్లు తెలుస్తుంది. వారికి ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండానే భారీగా వేతనాలు ఇస్తున్నట్లు డీప్‌మైండ్‌లో పనిచేస్తున్నవారు వెల్లడించారు. ఈ మేరకు మెటా తమ ఏఐ పనులను స్పీడప్ చేసినట్లు తెలుస్తుంది. తమ ప్లాట్ఫామ్లో వీడియో రికమండేషన్లు, తదితర ఫీచర్లను పూర్తిగా ఏఐతో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించింది. రీల్స్ మాత్రమే కాకుండా మొత్తం వీడియోలకు ఒకే ఏఐ మోడల్‌ను తీసుకొచ్చెందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఫేస్బుక్ హెడ్ టామ్ అలిసన్ వెల్లడించారు. వినియోగదారులను ఆకర్షించేందుకు అలాగే చాలా మంది ఇలాంటి సేవాలను కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.