»Bharateeyudu 2 Bharateeyudu 2 Event Date Fixed Global Star As Chief Guest
Bharateeyudu-2: ‘భారతీయుడు 2’ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్?
ప్రస్తుతం థియేటర్లో కల్కి హవా నడుస్తోంది. కానీ జూలై 12 నుంచి భారతీయుడు2 సందడి స్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ భారతీయుడు 2 ఈవెంట్ ఎప్పుడు?
Bharateeyudu-2: 'Bharateeyudu 2' event date fixed.. Global star as chief guest?
Bharateeyudu-2: స్టార్ డైరెక్టర్ శంకర్ ఎప్పుడో మొదలు పెట్టిన భారతీయుడు సీక్వెల్ సినిమా.. ఫైనల్‌గా ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రం కోసం కమల్ అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే హిందీ, తమిళ్ భాషల్లో మాత్రమే ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ ఇంకా తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ స్టార్ట్ అవలేదు. దీంతో.. తెలుగులో ఓ గ్రాండ్ ఈవెంట్ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. శంకర్ తన సినిమాలని తెలుగులో కూడా గట్టిగానే ప్రమోట్ చేస్తుంటాడు.
ఇప్పుడు భారతీయుడు 2ని కూడా ఇక్కడ ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ ఆదివారం.. అంటే, జూలై 7న హైదరాబాద్‌లో ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ ఈవెంట్‌కి కమల్ హాసన్‌తో పాటు సినిమాలో నటించిన ప్రధాన తారాగణం అంతా హాజరు కానుంది. అయితే.. ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఇండియన్ 2తో పాటు ‘గేమ్ ఛేంజర్’ను కూడా ఈక్వల్‌గా షూట్ చేశాడు శంకర్. భారతీయుడు 2 కంప్లీట్ అయింది కానీ, గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కానీ ఇండియన్ 2 రిలీజ్ అయ్యాక.. గేమ్ చేంజర్ బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేస్తానని చెప్పాడు శంకర్. కానీ ఈలోపు భారతీయుడు2 కోసం చరణ్‌ను రంగంలోకి దింపడానికి ప్లాన్ చేస్తున్నాడు శంకర్. అయితే.. చిత్ర యూనిట్ నుంచి దీని పై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇండియన్ కోసం గ్లోబల్ స్టార్ చరణ్ వస్తే.. తెలుగులో మరింత హైప్ క్రియేట్ అవడం గ్యారెంటీ.